వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలి. ఆ బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోందని పేర్కొన్నారు. వరుసగా గురుకులాల్లో ఇలాంటి ఘటనలు ఈ రెండు నెలల్లో చాలా జరిగాయి.
ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని.. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శలు చేశారు. సీఎం గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చేద్దురు కానీ, ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నానని పేర్కొన్నారు బండి సంజయ్.