MIM అత్యాచారాలు.. TRS హత్యలు, ఆత్మ హత్యలకు ప్రోత్సహిస్తుంది : బండి సంజయ్

-

MIM అత్యాచారాలు.. TRS హత్యలు, ఆత్మ హత్యలకు ప్రోత్సహిస్తుందని ఫైర్ అయ్యారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీ హిల్స్ మైనర్ గాంగ్ రేప్ కేసును నీరు గార్చెందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.. బిజెపి ఆందోళన తోనే ఈ మాత్రం చర్యలు ఉన్నాయన్నారు. సీఎం చేతగాని తనం లో ఉన్నారు.. అందుకే రోజుకో సంఘటన జరుగుతుందని మండిపడ్డారు.

తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ? అమాయకులను ఇబ్బంది పెట్టాలని బిజెపి కి లేదని ఫైర్ అయ్యారు. Mim ఎమ్మేల్యే కొడుకుకి సంబందం లేదని ఎందుకు చెప్పారు… ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు.. రాజకీయ పలుకు బడి ఉన్న కుటుంబాలను కాపాడడం లో పోలీస్ లు సక్సెస్ అయ్యారన్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారు..CMO కార్యాలయం ఆదేశాలతో నే ఇదంతా జరిగిందన్నారు. ఎంత మంది కళ్ళు పీకేశారు కెసిఆర్… నీకే కళ్ళు లేవు.. కెసిఆర్ కుటుంబం ఆదేశిస్తే తప్ప పోలీస్ లు స్పందించే పరిస్థితి లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news