కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు : బండి సంజయ్‌

-

ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శలు చేశారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్వతంత్ర సమర యోధులు ఏర్పాటు చేసిన దాన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా అప్పనంగా దోచుకున్నారని, అప్పనంగా దొబ్బిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఈడీ విచారణ చేయొద్దా.. అక్రమాలు బయటకు వస్తూ కాంగ్రెస్ ను ప్రజలు సమాధి చేస్తారని భయంతోనే ఇదంతా చేస్తున్నారు.. మోడీ, అమిత్ షా ల కూడా విచారణను ఎదుర్కొన్నారు నిజాయితీని నిరూపించుకొని బయటకు వచ్చారు.. అని ఆయన వ్యాఖ్యానించారు.

Karimnagar: Bandi Sanjay arrested for violating Covid norms

కాంగ్రెస్ లాగా విధ్వంసాలకు పాల్పడలేదని ఆయన గుర్తు చేశారు. అనుమతి లేదని మమ్మల్ని గృహ నిర్భంధం చేస్తారని, కాంగ్రెస్ వాళ్లు తడాఖా చూపిస్తాం అన్న వారిని ముందస్తు అరెస్ట్ చేయరు.. ప్రగతి భవన్ కు వెల్లోద్దు రాజ్ భవన్ కి మాత్రం వెళ్లొచ్చు.. టీఆర్‌ఎస్‌ సౌజన్యంతో కాంగ్రెస్ చేసిన విధ్వంసం ఇది అంటూ ఆయన మండిపడ్డారు.నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి వాస్తవాలను బయటకు చెప్పాలని, ఈడీ విచారణ ఎందుకో ప్రజలకు వివరిస్తామన్నారు. సీఎం కను సన్నల్లైనే ఇదంతా జరిగిందని, బీజేపీ బలపడుతుందనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news