అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు..జీవితపై బండ్ల గణేష్ ఫైర్

-

టీఆర్‌ఎస్‌ పార్టీ, కవిత, కేటీఆర్‌ లపై నిన్న బీజేపీ నాయకులు జీవిత – రాజశేఖర్‌ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ కు హైదరాబాద్‌ లోని పబ్‌ ల్లో వాటాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. అయితే.. జీవిత – రాజశేఖర్‌ చేసిన ఆరోపణలకు టాలీవుడ్‌ నిర్మాత, కాంగ్రెస్‌ నాయకులు బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు… జీవిత-రాజశేఖర్‌ కు అంటూ చురకలు అంటించారు. లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు,, మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు,, ఆదర్శ దంపతులు అంటూ ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌.

అన్ని పార్టీలు తిరిగారు.. ఇక సీపీఐ, సిపిఎం పార్టీల్లో కూడా చేరి… బ్యాలెన్స్‌ చేయండి అక్క.. అంటూ ఓ రేంజ్‌ లో సెటైర్ పేల్చారు. అంతేకాదు… జీవిత-రాజశేఖర్‌ ఏఏ పార్టీలో చేరారో.. ఆ పార్టీల ఫోటోలను బండ్ల గణేష్‌ షేర్‌ చేసి.. మరీ ఓ ఆట ఆడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news