ఫిబ్రవరిలో 9 రోజులు బ్యాంకులకు సెలవులు..!

-

కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరం లో మొదటి నెల కూడా మరి కొన్ని రోజుల్లో పూర్తి కాబోతోంది. అయితే మీరు ఏమైనా ఆర్ధిక లావాదేవీలు చేయాలనుకుంటే బ్యాంకు సెలవుల గురించి తప్పక తెలుసుకోండి. లేదంటే ముఖ్యమైన పనులు ఆగిపోతాయి.

ఇక ఫిబ్రవరి లో ఎప్పుడెప్పుడు బ్యాంక్ సెలవులు ఉన్నాయో ఇప్పుడే చూద్దాం. ఈ సెలవుల గురించి తెలుసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు పూర్తి చేసుకోవాలని అనుకునే ముఖ్యమైన పనులు పూర్తి కావు. కనుక ముందే సెలవుల గురించి చూసుకోండి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులు 9 రోజుల పాటు క్లోజ్. మరి ఏయే రాష్ట్రాలకు ఎప్పుడు సెలవు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 5 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 11 – రెండో శనివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 12 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి – కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్.
ఫిబ్రవరి 19 -ఆదివారం మరియు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి
ఫిబ్రవరి 20 రాష్ట్ర దినోత్సవం (అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం లో సెలవు)
ఫిబ్రవరి 21- లూసార్‌ సిక్కింలో బంద్‌
ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవే)
ఫిబ్రవరి 26 – ఆదివారం (అన్ని చోట్ల సెలవే)

Read more RELATED
Recommended to you

Latest news