క్రెడిట్ కార్డు ని వాడుతున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!

-

చాలా మంది క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఏదైనా కొనాలంటే క్రెడిట్ కార్డ్ ని టక్ అని తీసేస్తూ ఉంటారు అయితే మీరు కూడా క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారా అయితే తప్పకుండా మీరు దీన్ని ఇప్పుడు చూడాలి. క్రెడిట్ కార్డ్ ని చాలామంది ఎక్కువగా వాడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ తప్పులు మాత్రం చేయకుండా వీటి పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది.

క్రెడిట్ కార్డులను ఉపయోగించే వాళ్లు లిమిట్ ని పెట్టుకోండి కొంత లిమిట్ వరకు మాత్రమే వాడండి.
క్రెడిట్ కార్డులని ఉపయోగించే వాళ్ళు చాలామంది మోసాల బారిన పడుతున్నారు ఇలా కాకుండా జాగ్రత్త పడాలి.
ఒకవేళ కనుక మీరు పెద్ద మొత్తంలో పేమెంట్ చేయాలనుకుంటే రెండు నుండి మూడు కార్డుని ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఖర్చు తగ్గుతుంది ఒకేసారి ఒకే కార్డు ఎక్కువ పేమెంట్ చేస్తే దాని వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు.
ఆటో పేమెంట్ ఫెసిలిటీని పెట్టుకుంటే మంచిది అప్పుడు మీరు బిల్లు కట్టడం మర్చిపోకుండా ఉంటారు.
అదేవిధంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు చాలా రకాల ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అందుకని మీరు మీ ఖర్చులు కి తగ్గట్టు మీకు సౌకర్యంగా ఉండే కార్డు ని తీసుకోండి అప్పుడే అది మీకు ప్లస్ అవుతుంది.
అదేవిధంగా క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకులో రివార్డ్ పాయింట్లను ఇస్తుంది దీన్ని ఎలా వాడాలో మీరు తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.ఎక్కువగా మీరు క్రెడిట్ కార్డ్ దేనికి ఉపయోగిస్తున్నారో చూసుకుని దానికి తగ్గ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే ముందు మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది చూసుకోండి అప్పుడే క్రెడిట్ కార్డు తీసుకోండి.
ఈఎమ్ఐ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కానీ క్యాష్ విత్డ్రా చేసినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు డ్రా చేశారంటే ఆ రోజు నుండే వడ్డీ రేటు పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news