స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో సేవలను అందిస్తోంది. అయితే తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన మొబైల్ అప్లికేషన్ యోనో మాత్రం కస్టమర్స్ కి విసుగు తెప్పించింది. యూజర్లకు ఇన్స్టా లోన్లు ఇస్తామంటూ పదే పదే మెసేజ్లు వచ్చాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఇన్స్టా లోన్లు ఇస్తామంటూ మెసేజెస్ వచ్చాయి. దీనితో కస్టమర్స్ కి చిరాకు వచ్చేసింది. ట్విటర్ వేదికపై ఈ విషయాన్ని కస్టమర్స్ తెలిపారు. ఇక ఎందుకు ఇవి వచ్చాయి అనేది చూస్తే.. టెక్నికల్ సమస్యతో ఈ మెసేజ్లు వచ్చాయని తమల్ని క్షమించాలంటూ ఎస్బీఐ యూజర్లకు తెలిపింది.
అలానే ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. వందల మంది ఎస్బీఐ యోనో యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ లోన్ మెసేజ్లతో యోనో యాప్ నన్ను స్పామ్ చేస్తోంది.
దయచేసి ఈ సమస్యను పరిష్కరించగలరు అంటూ స్టేట్ బ్యాంక్ కి చెప్పారు. ర్యాండమ్ పేర్లతో ఎస్బీఐ ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ గురించి యోనో లైట్ నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి అని కూడా అంటున్నారు. టెక్నికల్ సమస్య వల్ల, యోనో లైట్ అప్లికేషన్ ద్వారా ఈ తప్పుడు మెసేజ్లు కొందరు యూజర్లకు వచ్చాయని అంది. త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంక్ అంది.