అన్నదాతలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ వడ్డీకే రుణాలని అందిస్తుందని బ్యాంక్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే తాజాగా రైతులకి అగ్రి గోల్డ్ లోన్ పేరుతో లోన్స్ ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

యోనో యాప్‌లో అప్లై చేసి అతి తక్కువ వడ్డీతో రైతులు లోన్ తీసుకోచ్చు. ఈ విషయాన్నీ స్టేట్ బ్యాంక్ ట్విట్టర్‌లో వెల్లడించింది. యోనో యాప్ ద్వారా అప్లై చేస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది. కేవలం 7 శాతం నుంచే వడ్డీ మొదలవుతోంది. పైగా లోన్ కూడా త్వరగా వచ్చేస్తుంది. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసుకోచ్చు. సొంత పొలంలో లేదా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఈ లోన్ ని తీసుకోచ్చు.

రైతులు తమ అవసరాల కోసం ఈ లోన్ ని తీసుకోచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం కోసమైనా లేదు అంటే యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్ మొదలైన వాటి కోసం అయినా సరే ఈ లోన్ తీసుకోచ్చు. అగ్రి గోల్డ్ లోన్ బంగారు నగలపై లభిస్తుంది.

24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. అలానే 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైన కూడా లోన్ పొందొచ్చు. ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. అయితే యోనో ఎస్‌బీఐ యాప్‌లో రైతులు అప్లై చేసుకుంటే 7 శాతం వడ్డీ మాత్రమే.

యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.
ఆ తరవాత బ్యాంక్ అకౌంట్ వివరాలతో యాప్‌లో లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో YONO Krishi పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఖాత పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అగ్రి గోల్డ్ లోన్ పైన క్లిక్ చేయాలి.
ఇక్కడ మీరు అప్లై ఫర్ గోల్డ్ లోన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చెయ్యండి.
వివరాలన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంత లోన్ కావాలో చెప్పాలి.
అలానే లోన్ ఎందుకు తీసుకుంటున్నారో తెలపాలి.
ఇప్పుడు మీకో రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
ఆ రిఫరెన్స్ నెంబర్‌తో సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి.
డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత లోన్ మంజూరవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news