చర్లపల్లి సెంట్రల్ జైలులో రాజాసింగ్ కి బ్యారక్ మార్పు

-

చర్లపల్లి సెంట్రల్ జైలులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బ్యారక్ ని మార్చారు జైలు అధికారులు. మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్ కి మార్చారు జైలు అధికారులు. అలాగే జైలులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజా సింగ్ కు భద్రతను పెంచారు చర్లపల్లి జైలు అధికారులు. రాజాసింగ్ విషయంలో అన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో జైలులో రాజా సింగ్ ను కలవడానికి వస్తున్న వారిని ఆరా తీస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.

రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ ( పీడీ యాక్ట్) కింద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాజా సింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బిజెపి క్రమశిక్షణ కమిటీ ఆదేశించిన నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బిజెపి అధిష్టానానికి లేఖ రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని తన సస్పెన్షన్ రేపటితో ముగియడం తో సమయం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news