తెలంగాణలో రేపు(గురువారం) సద్దుల బతుకమ్మను ఆడపడచులు జరుపుకోనున్నారు. అందుకోసం రాజధాని హైదరాబాద్ ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ అంతటా రేపు రాత్రి నుంచి సందడి వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే అధికారులు బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి ట్యాంక్ బండ్ వద్దకు తీసుకురానున్నారు.
హుస్సేన్ సాగర్‌తో పాటు బాగ్ లింగంపల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, సరూర్ నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని జీహెచ్ఎంసీ మైదానాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు అన్నిఏర్పాట్లను పూర్తి చేశారు. దీంతో రేపు రాత్రంతా బతుకమ్మ వేడుకల ఆటపాటలు, రంగు రంగుల బతుకమ్మలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కనువిందు చేయనున్నాయి.