టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెప్టెంబర్‌లో బీసీసీఐ మాట్లాడిందని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోరిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరుతూ ముంబయి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీ సంచలన ప్రకటనల చేశారు. కెప్టెన్సీ విషయంలో సరైన సమాచారం లేదని కోహ్లీ ఆరోపించడాన్ని బీసీసీఐ తోసిపుచ్చింది.
ఆ రోజు ఉదయం జరిగిన సమావేశంలో వన్డే కెప్టెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని విరాట్ కోహ్లీకి చేతన్ శర్మ తెలుపాడని బీసీసీఐ అధికారి తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు 18మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన రోజునే వన్డే కెప్టెన్‌గా తొలగించిన తీరుపై కోహ్లీ బీసీసీఐతో గల సమన్వయ లోపాన్ని ఎత్తిచూపారు.
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని విరాట్ కోహ్లీని కోరినట్టు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా విరాట్ కోహ్లీ ప్రకటన చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు నుంచి మంచి స్పందన వచ్చిందని కోహ్లీ విలేకరులతో చెప్పాడు.