బ్యూటీ స్పీక్స్ : మాతృత్వ‌పు మ‌ధురిమలో అందాల కాజ‌ల్

-

జ‌గ‌తికి ప్రాణం స్త్రీ రూపం.. జ‌గ‌తికి ఆధారం కూడా స్త్రీ రూపం అని చెప్పిన గొప్ప మాట‌ల ప్ర‌స్తావ‌నలో ఇవాళ ఆ జంట ఉంది. కాజ‌ల్ మ‌రియు గౌత‌మ్ కిచ్లు జంట అద్వితీయ అనుభూతికి ప్ర‌తిరూపంగా ఉంది. త‌మ ఇంటి వార‌సుడ్ని చూసుకుని మురిసిపోతోంది.

ఆ వైనం బ్యూటీ స్సీక్స్ లో.. అందం మాట్లాడుతుంది అని అంటాం క‌దా! ఇక్క‌డ మాతృత్వ‌పు పోక‌డల్లో దాగి ఉన్న అందం మాట్లాడుతోంది అని రాయాలి. అందులో దాగి ఉన్న అరుదైన భావ‌న‌ల గురించి వ‌ర్ణించి వివ‌రించి త‌త్ సంబంధిత మనో వాంఛ‌ల గురించి విస్తృతం చేయాలి. అందాల తారలు అభిమానుల‌కు అపురూపం.. వారి న‌డ‌వ‌డి ప్ర‌వ‌ర్త‌న  ఇంకా వారి వ్య‌క్తిగ‌త జీవితం కూడా వారికెంతో ముఖ్యం. ఆ విధంగా తెలుగు తెర‌పై త‌ళుకులీనిన పంచదార బొమ్మ ఓ మెట్టినింటి గుమ్మం చేరాక ఆమె జీవితంలో వ‌చ్చిన ప్ర‌తి అంద‌మైన మార్పున‌కు సంబంధించిన సంద‌ర్భం గురించి  చెబుతూనే ఉన్నారు. ఆ విధంగా ఆమె అభిమానుల‌కు మ‌రింత చేరువ అయ్యారు కూడా !

అమ్మ అయ్యే అదృష్టం..అమ్మ రూపానికి ప్ర‌తి రూపంగా న‌డుచుకునే వారంటే ఆడ‌బిడ్డ‌ల‌కు అది ఒక అరుదైన సంద‌ర్భ‌మే! అమ్మ‌త‌నం పొందడం ఓ వ‌రం అయితే ఆ ఆనందాల్లో తోటి వారినీ న‌డిపించ‌డమూ ముఖ్య‌మే ! అందుకే ఆడ జన్మ కు సార్థ‌క‌త అమ్మ అయ్యే అరుదైన క్ష‌ణ‌మే ! అందాల తారలు అయినా అమ్మత‌నానికి అతీతులు కాదు.. అవ‌తార పురుషుడే కానీ ఓ అమ్మ‌కు కొడుకే క‌దా! అని క‌వి అన్న‌ది అందుకే ! ఈ నేప‌థ్యంలో అందాల కాజ‌ల్ అమ్మత‌నంను పొంది అరుదైన అపురూప క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తూ సంబంధిత భావోద్వేగ స‌హిత మాట‌లను తోటి వారికీ అందిస్తూ ఉంది.

అందాల కాజ‌ల్ .. కొన్ని రోజులు తెలుగు తెర‌కు దూరం కావొచ్చు కానీ ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఆమె ద‌గ్గ‌రే ! త్వ‌ర‌లో ఆమె న‌టించిన ఆచార్య చిత్రం విడుద‌ల కానుంది. మెగాస్టార్ తో న‌టించిన  రెండో చిత్రం ఇది.ఈ సినిమా ప్రొగ్ర‌స్ ఎలా ఉన్నా కాజ‌ల్ మాత్రం ఓ విష‌య‌మై ఎప్ప‌టి నుంచో త‌న జీవిత కాల అనుభ‌వాల‌ను పంచుకుంటూ వ‌స్తున్నారు. అమ్మ అయి ఎంతో సంతోషిస్తున్నానని తాను గ‌ర్భ‌వ‌తిని అన్న విషయం వెల్ల‌డించిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ తాను తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అదే విధంగా ప్ర‌తి త‌ల్లీ తీసుకోవాల్సిన ఆహారం పాటించాల్సిన నియ‌మాలు కూడా వివ‌రిస్తూ వ‌స్తున్నారు. మాతృత్వ‌పు లాల‌న‌లో తాను ఏ విధంగా త‌న్మ‌యం పొందుతున్నానో కూడా చెప్పారు.

ఆ విధంగా అందాల కాజ‌ల్ మాతృత్వ‌పు మ‌ధురిమ‌ను ఆస్వాదిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఆమె ప్ర‌స‌వించారు. కొడుకు పేరు నీల్ కిచ్లు అని ప్ర‌క‌టించారు. అమ్మ అయిన సందర్భాన ఆమె ఆనందానికి అవ‌ధులే లేవు. ముఖ్యంగా ఆమె ఎప్ప‌టి నుంచో కొన్ని ఫొటోలు కూడా నెటిజ‌న్ల‌తో షేర్ చేసుకుంటూ త‌న ఆనందాన్ని కొనసాగిస్తూ వ‌స్తున్నారు. మాతృత్వ‌పు ఆనందాల‌కు కొనసాగింపు ఇస్తూ అందాల న‌టి త‌న అనుభూతులు త్వ‌ర‌లోనే మ‌రికొన్ని పంచుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version