ఆ ప్రశ్న అడిగినందుకే దత్తపుత్రుడికి బీపీ వచ్చి ఊగిపోతున్నారు: సీఎం జగన్

-

సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ‘దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, తర్వాత కార్లు మార్చినట్లు భార్యలను మార్చారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.అలాగే ఇప్పుడు నియోజకవర్గాలను ఎందుకు వదిలేస్తున్నావ్ అని అడిగా అని అన్నారు. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ చేస్తే అలవాటు అంటారు. నిన్ను చూసి ఇదే తప్పు అందరూ చేస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి అని అడిగా అని తెలిపారు. అందుకే ఆయనకు బీపీ పెరిగిపోయి ఊగిపోతున్నారు’ అని తెలిపారు.

మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు .ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version