వెన్నుముక విరిగిపోయినా.. వడపావ్ బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.25 లక్షలు..!

-

ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సక్సెస్ అందుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు మనకి ఎదురయ్యే సంఘటనలు మనల్ని బాగా కృంగిపోయేలా చేస్తాయి. అయితే నిజానికి వాటిని తట్టుకుంటూ వాటి నుండి బయట పడితే.. అప్పుడే జీవితం బాగుంటుంది. లేదంటే అక్కడే ఉండాల్సి ఉంటుంది.

 

గుజరాత్ కి చెందిన ఇందు బెన్ రాజ్పుత్ 2017 లో బైక్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె వెన్నెముకకు అనేక పగుళ్ళు ఏర్పడ్డాయి. నరాలు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. అప్పటి నుండి కూడా ఆమె మంచానికే పరిమితం కావలసి వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు కూడా ఎటూ తోచని పరిస్థితిలో పడిపోయారు. అయితే ఆమె అంత ఘోర ప్రమాదం చూసినా తిరిగి మళ్ళీ జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకున్నారు.

ఆమెని ఆస్పత్రిలో చేర్చినప్పుడు కుటుంబమంతా కూడా ఎన్నో అప్పులు చేయాల్సి వచ్చింది. పైగా ఆ సమయంలో కుటుంబం అంతా కూడా ఎంతో కష్టపడ్డారు. ఇందు బెన్ కి వంటలు చేయడం బాగా వచ్చు. అయితే కూతుర్లు ఆమె కోలుకున్నాక వండి డబ్బులు సంపాదించ వచ్చు కదా అని సూచించారు. ఆమె కూడా వంటలను చేసి అమ్మాలని అనుకున్నారు. ఆమె చిన్నప్పుడు నుంచి ఎక్కువగా ఇష్టపడే వడా పావ్ లను తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

మామూలుగా కాకుండా కొన్ని మసాలాలను ఆమె అందులో యాడ్ చేశారు. దీంతో ఆమె వడాపావ్ కి రుచి బాగా వచ్చింది 2019లో ఈమె ఒక చిన్న స్థలాన్ని అద్దెకి తీసుకుని ఈ వ్యాపారం మొదలుపెట్టారు. వడ పావ్ తో మొదలు శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ ఈమె అమ్మడం మొదలు పెట్టారు. రోజుకు సగటున 30 నుండి 40 ఆర్డర్లు వాళ్ళకి వస్తాయి.

గత నెలలో ఈమె 1.25 లక్షలను సంపాదించారు. అయితే ఎక్కువ భాగం తిరిగి పెట్టుబడి పెట్టారు. మిగిలిన ఎనిమిది వేలు ఆమె ఇంటికి తీసుకెళ్లారు. నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఈమెను ఆదర్శంగా తీసుకోవాలి. మనం మనకు జరిగిన పరిస్థితులను పక్కన పెట్టేసి ముందుకు వెళ్లి పోవాలి అంతే కాని వాటిలోనే కూరుకుపోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news