ఉదయంపూట పెరుగు, అరటిపండు తింటే ఈ లాభాలు పొందొచ్చు..!

-

అన్నిటి కంటే అల్పాహారం చాలా ముఖ్యమైనది. కనుక మంచి పోషక పదార్థాలు ఉండే అల్పాహారం తీసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే పెరుగు మరియు అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు తక్కువ సమయంలోనే మనం దానిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా తీసుకోవడం వల్ల దీనిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ b6, మెగ్నీషియం మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

అలానే అరటి పండులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా సోడియం, క్యాల్షియం మనకి పెరుగు ద్వారా లభిస్తుంది. సరైన పోషక పదార్థాలతో రోజు మొదలు పెట్టాలి కనుక ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే పెరుగు అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.

బరువు కంట్రోల్లో ఉంటుంది:

అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే పెరుగులో కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. హెవీగా ఉండే ఈ పదార్ధాలు తీసుకున్న తర్వాత ఎటువంటి జంక్ ఫుడ్ తినడానికి వీలు అవ్వదు. ఇలా బరువుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అలానే అరటి పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇలా కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఒత్తిడి తగ్గుతుంది:

అరటి పండులో ఉండే పొటాషియం మజిల్స్ ని రిలాక్స్ గా ఉంచుతుంది. పెరుగులో ఉండే సోడియం ముజిల్ కాంట్రక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మూడ్ కూడా బాగుంటుంది.

కాన్స్టిపేషన్ సమస్య ఉండదు:

ఉదయం పూట దీనిని తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు అలాగే ఈ మిశ్రమం లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్ బి6 ఉండడం వల్ల ఎనర్జీ ఉంటుంది. ఇలా ఎన్నో సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version