కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా ఉంటుంది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం 2014లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మీ చిన్నారి పేరున ఈ ఖాతాని ఓపెన్ చేయించచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ఖాతాను తెరువవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
గరిష్టంగా ఇద్దరు కూతుళ్ల పేరు మీద ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఇక ఈ ఖాతాని తెరవాలి అంటే SSY అకౌంట్ ఓపెనింగ్ ఫాం కావాలి. చిన్నారి పుట్టిన తేదీ సర్టిఫికెట్, పాప తల్లిదండ్రులు లేదా సంరక్షుల చిరునామా ప్రూఫ్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే కనీస డిపాజిట్ రూ.250.
గరిష్ట డిపాజిట్ మొత్తం రూ.1.50 లక్షలు. ఇది ఇలా ఉంటే ప్రస్తుత మార్చి త్రైమాసికం వరకు వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. తాజా ఫైనాన్స్ బిల్లులో ఈ పథకంపై ట్రిపుల్ మినహాయింపు ప్రయోజనాలను పొడిగించారు. ఇది ఇలా ఉంటే సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. దీనిలో పదిహేనేళ్లు ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ స్కీమ్ నుండి డబ్బులు తీసుకోవాలంటే అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతనే తీసుకోవాలి. అప్పటి వరకు అవ్వదు.