‘బీఏ5’ వేరియంట్‌తో ముప్పు : భారత్​ బయోటెక్

-

‘కొవిడ్‌’ వ్యాధికి చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌)కు ఈ నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అనుమతి లభిస్తుందనే ఆశాభావాన్ని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వ్యక్తం చేశారు. ‘అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే, ఈ నెలలోనే అనుమతి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

‘కొవిడ్‌’ వ్యాధి మళ్లీ విరుచుకుపడినా, వైరస్‌లో కొత్త రకం పుట్టుకొచ్చినా చుక్కల మందు టీకాతో దాన్ని ఎదుర్కోగలుగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలతో పాటు చుక్కల మందు టీకాతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. చుక్కల మందు టీకాను 4,000 మంది వాలంటీర్లపై పరీక్షించి చూశామని, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కనిపించలేదని తెలిపారు.

బీఏ5 అనే కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ సోకిన వారు, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురుకావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా, ఒమిక్రాన్‌ రకం వైరస్‌లతో పోల్చితే బీఏ5 వేరియంట్‌ పూర్తిగా భిన్నమైనదని, అందుకే ఈ కొత్త రకం వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ఈ విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నట్లు, ముమ్మర పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news