పవన్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్… దీపావళికి టీజర్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడి గా నిత్యా మీనన్ నటిస్తుండగా రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

అంతేకాకుండా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న సినిమా ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లను మరియు పవన్ రానాకు సంబంధించిన వీడియోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి ఈ టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version