నుపుర్ శర్మపై భీవండి పోలీసులు నోటీసులు జారీ

-

నుపుర్ శర్మపై మహారాష్ట్రలోని భీవండి పోలీసులు సమన్లు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ప్రభుత్వం పార్టీ నుంచి తీసివేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఆమె వాంగ్మూలం నమోదు చేసుకుని నోటీసులు జారీ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అలాగే మరో బహిష్కృత బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్‌పై కూడా ఈ నెల 15వ తేదీన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని నోటీసులు జారీ చేశారు. మే 30వ తేదీన రజా అకాడమీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌పై కేసు నమోదు చేసినట్లు భీవండి పోలీసులు పేర్కొన్నారు.

నుపుర్ శర్మ
నుపుర్ శర్మ

ఈ మేరకు నుపుర్ శర్మను థానే జిల్లా పోలీసులు కూడా ఈ నెల 22వ తేదీన పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అలాగే చర్చకు సంబంధించిన వీడియో ఫుటేజీ కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన నుపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్‌ను సైతం బీజేపీ బహిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా వారిపై నిరసనలు వెలువెత్తాయి. బీజేపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని పేర్కొంది. ఆ తర్వాత నుపుర్ శర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. మీడియా ముందు క్షమాపణ కూడా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news