మోడ్రన్ డ్రెస్‌లో మైమరిచిపోతున్న ‘ఖుషి’ భామ..వన్నె తగ్గని అందం భూమిక చావ్లా సొంతం

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఖుషి’ సినిమాలో  ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’ అనే సాంగ్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ భూమిక చావ్లా స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ఈ సుందరి.. ఆ తర్వాత కాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించింది.

దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బబ్లీ బ్యూటీ. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ సీనియర్ హీరోయిన్..నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘ఎం.సి.ఏ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ పిక్చర్ లో నానికి వదినగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఈ క్రమంలోనే భూమిక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా మోడ్రన్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలలో భూమిక నలుపు రంగు మోడ్రన్ డ్రెస్ ధరించి ఉంది. ఇక ఈ ఫొటో లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావ్, స్టన్నింగ్ లుక్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నటి ‘పెన్ అదిమై ఇల్లై,90 మినిట్స్’ చిత్రాలలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version