‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ ఓటీటీ షోలో కంటెస్టెంట్స్ తమ ఆటపైన ఫుల్ ఫోకస్ పెట్టేశారు. బిగ్ బాస్ ఇంటిలో ప్రస్తుతం 11 మంది సభ్యులే ఉన్నారు. ఇక ఈ ఏడో వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేసి రీజన్స్ ఇవ్వాలని ‘బిగ్ బాస్’ చెప్పారు. దాంతో మెజారిటీ కంటెస్టెంట్స్ సంచాలక్ గా వ్యవహరించిన అషురెడ్డి పేరు చెప్పేసి ఆమె ముఖం మీద ఇంటూ మార్క్ స్టాంపులేశారు.
అలా అషురెడ్డి వరస్ట్ కంటెస్టెంట్ అయిపోయింది. జైలులోకి వెళ్లిన సమయంలో ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్కులు చూసేందుకు కూడా అషురెడ్డికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే జైలులో ఉన్న అషురెడ్డిని అరియానా పలకరించలేదు. కానీ, బిందు మాధవి మాత్రం పలకరించి చక్కటి ఇంప్రెషన్ కొట్టేసింది. మొదటి నుంచి కూడా బిందు మాధవి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇస్తూ తనదైన పంథాలో ముందుకు సాగుతున్నదని చెప్పొచ్చు.
ఇక ఫ్యామిలీ టాస్కులో హమీద కొడుకుగా అనిల్ వ్యవహరించడాన్ని నటరాజ్ మాస్టర్ తప్పుబట్టారు. దాని గురించి వారు చర్చ కూడా చేశారు. అయితే, టాస్కు గెలిచన క్రమంలో తనకు లభించిన డోనట్ ను చిన్న పీస్ చేసి అనిల్ కు ఇచ్చింది అరియానా. అనిల్ కూడా అందులో ఇంకో చిన్న పీస్ చేసి శివకు ఇచ్చాడు.
అలా ఒక అండర్ స్టాండింగ్ ప్రకారం గేమ్ లో ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తోంది. సంచాలక్ గా అషురెడ్డి వ్యవహరించిన తీరు పట్ల కంటెస్టెంట్స్ పూసగుచ్చినట్లు వివరించి మరీ ఆమె వరస్ట్ కంటెస్టెంట్ అని పేర్కొన్నారు. బీబీ లవర్స్ సైతం అషురెడ్డి తీరు పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.