టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ బౌలర్ ఔట్

-

స్వదేశంలో న్యూజిలాండ్-ఏ తో జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నుంచి భారత ఏ జట్టు స్టార్ బౌలర్ అవుట్ అయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బెంగుళూరు వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రసిద్ధు కృష్ణ తప్పుకున్నాడు. ఆఖరి నిమిషంలో ప్రసిద్ధు కృష్ణ తప్పుకోవడంతో టీమిండియా అనుభవ లేమి ఫేసు దళంతో బరిలోకి దిగింది.

గత కొంతకాలంగా తరచూ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రసిద్ధు, ఈ మ్యాచ్ తో పాటు మొత్తం సిరీస్ కే అందుబాటులో ఉండాలని బిసిసిఐ ప్రతినిధి వెల్లడించారు. కాగా, కివీస్-ఏ తో 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ప్రియాంక్ పంచల్ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ లో టాస్ ఓడి తోలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ధు తప్పుకోవడంతో భారత-ఏ జట్టు నలుగురు స్పెషలిస్టు బౌలర్లతోనే బరిలోకి దిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version