ఈటల ఇలాకలో.. టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. హుజూరాబాద్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని తెలంగాణ ప్రజలంతా చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ఈటెల రాజేందర్ ను ఒంట‌రి చేయాల‌ని టీఆర్ఎస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇంకోవైపు త‌న బ‌ల‌గాన్ని పెంచుకునేందుకు ఈట‌ల రాజేంద‌ర్ హుజూరాబాద్ లోనే మకాం వేసి తన వ‌ర్గీయుల‌ను చేజారిపోకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు వ‌రుస‌గా టీఆర్ఎస్‌ కు జై కొడుతున్న నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపి మ‌ళ్లీ త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అటు టీఆర్ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్‌రావును రంగంలోకి దించింది. ఇది ఇలా ఉండగా తాజాగా హుజూరాబాద్ నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు, ఇతర నాయకులు ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. అంతేకాదు జమ్మికుంటలో జై ఈటల అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక అనంతరం టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు, ఇతర నాయకులు జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద పార్టీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news