బాలయ్యకు బిగ్ షాక్.. వీర సింహారెడ్డి డైలాగులపై జగన్ సీరియస్ !

-

నందమూరి బాలయ్యకు షాక్ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా డైలాగ్స్ పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని డైలాగులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ఏ సందర్భంలో ఆ డైలాగ్స్ చెప్పారు ? ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసుకునేందుకు కొందరు అధికారులు స్వయంగా సినిమా చూసినట్లు సమాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ మరియు మాటలు ఉన్నట్లు జగన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు గుర్తించారట. అయితే వీటిని త్వరలోనే జగన్ సమీక్షించి… చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట. కాగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టాక్ బాగా రావడంతో జనాలు కూడా విపరీతంగా థియేటర్లలో కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version