Bigg Boss 5 Telugu: సిరి గాలి తీసేసినా కింగ్ నాగ్‌.. ఫీలయ్యిన హ‌మీదా.. అస‌లేం జ‌రిగిందంటే!

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు.. బుల్లితెర ప్రేక్ష‌కుల అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ ను ఇస్తున్న రియాలిటీ షో. కామెడీ, కాంట్రావర్శీలు, గొడ‌వ‌లు, లవ్ ట్రాకులు, డ్రమాలు, ఫిజికల్ టాస్క్లు.. ఇలా ఉగాది పచ్చడిలా అన్ని రకాల ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ బిగ్ బాస్. ఇప్ప‌టివ‌ర‌కూ ఐదు వారల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అన్నీ రకాల వర్గాల ప్రేక్షకులని మెప్పిస్తూ కనువిందు చేస్తుంది బిగ్ బాస్. 19 మంది ఇంటి స‌భ్యుల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో నలుగురు ఎలిమినేట్ కాగా.. మొత్తం 15 మంది ఉన్నారు. ఇక ఐదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసన్నమైంది. అక్టోబర్ 9న జరిగిన వీకెండ్ షో రచ్చ చేయడానికి శనివారం నాగార్జున వచ్చేశారు. ఏం జ‌రిగిందో తెలుసుకుందామా.

శనివారం షోలో.. రాజా రాజా ది గ్రేట్ రా పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగ్ కింగ్. కంటెస్టెంట్స్ అందరితో ముచ్చాటించారు. ఆ త‌రువాత త‌న‌దైన శైలిలో అనేక రకాల విషయాలపై కంటెస్టెంట్లపై ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురించాడు. ముందుగా శ్రీరామ్‌ను టార్గెట్ చేశారు. నీకు బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా? హమీదా ముఖ్యమా? అని ప్రశ్నించగా.. నాకు బిగ్ బాస్ టైటిలే ముఖ్య‌మేన‌ని శ్రీ‌రామ్ బ‌దులిచ్చాడు. దీంతో హమీదా అలిగి.. బుంగ‌ముతి పెట్టుకుంది.

ఆ త‌రువాత షన్ను గ్యాంగ్ ను టార్గెట్ చేశారు. ఈ గ్యాంగ్ లోని ప్రధాన పాత్ర పోషించే సిరిపై నాగార్జున ఎవరూ ఊహించని ప్రశ్నలు విసిరారు. సిరిని నాగార్జున అడిగిన ప్రశ్నలు కాస్త కౌంటర్ గానే అనిపించాయి. సిరి చేసిన పొరపాట్లను ఒక్కోటి బ‌య‌ట పెట్టాడు నాగార్జున. హౌస్ లో ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడకూడదంటావ్ గా సిరి.. మ‌రి నువ్వు నీ అడ్డాలో నువ్వు కూర్చుని చేస్తున్నది ఏమిటీ సిరి అంటూ పంచ్ వేసారు నాగార్జున‌.

దీంతో ఒక్కసారిగా తల దించుకుంది సిరి. తాను చేసింది త‌ప్పు అని తెలిసినా.. మళ్లీ ఏదో మాట్లాడే కవర్ చేసేందుకు సిరి ప్రయత్నం చేసింది. కానీ నాగార్జున మాత్రం అది కరెక్ట్ కాదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సన్నీ నువ్వు రాజువి కాలేకపోవడం చాలా బాధనిపించింది. అయినా నీకు నువ్వే బాహుబలిగా ఫీల్ అయ్యావ్ కదా.. అయితే లాస్ట్ వీక్ నువ్వు చేసి తప్పుల వల్లే ఓడిపోయావు అంటూ సద్ధి చెప్పారు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Exit mobile version