బిగ్ బాస్ ఒక బూతుల షో – సిపిఐ నారాయణ

-

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ టీవీ ముందే ఉండి మరి ఆసాంతం చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ ప్రోగ్రాం మీద సిపిఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా నారాయణ ఒక వీడియో విడుదల చేస్తుంటారు. ఈ సీజన్ కి కూడా తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈసారి తన మాటల్లో మరి కాస్త ఘాటు పెంచుతూ.. అది చాలా అనైతిక షో అని, భూతల ప్రపంచం అని ఆయన విరుచుకుపడ్డారు. ” సిగ్గు, యగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవు. భార్య, భర్త, కానోళ్లు, అన్నా చెల్లెలు ముక్కు ముఖం తెలియని పిటపిటలాడే అందగాళ్ళు, అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజులపాటు భూతుల స్వర్గంలో అమూల్య కాలాన్ని వృధా చేసే మహత్తర బిగ్ బాస్ వస్తున్నది”. అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news