బిగ్ బాస్: రేవంత్ నువ్వు మాములోడివి కాదు సామీ.. నీ ట్రిక్ వర్కౌట్ అవుతుందా..?

-

బిగ్ బాస్.. ఇంట్లో టాస్కులు బిగ్ బాస్ ఇచ్చినట్లే ఆడాలన్న రూల్ ఏమీ లేదు.. ఇక రూల్స్ లోని లూప్ హోల్స్ వాడి ఆటను ఎలా అయినా ఆడవచ్చు. ఒకవేళ అది తన రూల్స్ కి విరుద్ధం అని భావిస్తే వెంటనే హెచ్చరిస్తాడు కదా.. లేదా చివర్లో ఒక ట్విస్ట్ ఇస్తాడు. అలా ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో అడవిలో ఆట అనే టాస్క్ పెట్టాడు. అడవిలో విలువైన వస్తువులుంటాయి. వాటిని దొంగలు దొంగలించాల్సి ఉంటుంది. ఆ విలువైన వస్తువులను గుర్తుపట్టేందుకు వాటికి ఎర్ర తాడుతో కట్టి ఉంచుతారు.. అయితే ఎర్ర తాడు కట్టిన వస్తువులకు విలువ ఉంటుందని , తమకు దొరికిన వస్తువులకు ఎర్ర తాడు కడితే తప్పు కాదు కదా అని రేవంత్ భావించాడు.

దీంతో తనకు కనిపించిన విలువైన వస్తువులకు ఎర్రతాడు కట్టుకుంటూ పోయాడు. వాటికి విలువ ఉందని ఇంటి సభ్యులందరినీ నమ్మించేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇక నేటి ఎపిసోడ్లో రేవంత్ వస్తువులను దొంగలు దొంగలించేస్తారు . దొంగల టీంలోనే ఇలా దొంగతనం చేసుకుంటూ ఉంటారు.. దొంగతనం చేశారు ఇదంతా గేమ్లో పార్ట్ అని గీతూ అంటుంది.. ఇక రగిలిపోయిన రేవంత్.. ఇంట్లో అందరి వస్తువులను దొంగతనం చేస్తాను.. పోలీసుల టీం గెలిచేలా చేస్తాను అని రేవంత్ పంతంగా ఆడతాడు. అయితే వస్తువులకు ఎర్ర తాడు కడుతూనే పోతున్నాడు .. వాటిని విలువైన వస్తువులుగా చలామణిలోకి తీసుకొస్తున్నాడు. మరి వీటిని బిగ్ బాస్ లెక్కలోకి తీసుకుంటాడా ?లేదా? అన్నది తెలియడం లేదు.

ఒకవేళ వాటిని పక్కన పెట్టేస్తే రేవంత్ బొమ్మలను దొంగతనం చేసిన వారు , వాటిని నమ్మి తీసుకున్న పోలీసులు బకరాలవుతారు.ఇదంతా రేవంత్ తన ట్రిక్ ఉపయోగించి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గీతూ, రేవంత్ లు మాత్రమే ఆటను ఎలా తిప్పాలి? ఎలా ఆడితే ఆట మజాగా ఉంటుందో తెలిసిన వాళ్ళు.. మరి ఈ అడవిలో ఆట టాస్క్ చివరికి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయో? బొమ్మలు ఉంటాయో? చూడాలి. ఈ విషయం చూసిన ఆడియన్స్ రేవంత్ ను తెగ పొగిడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version