బిగ్ బాస్ రియాలిటీ షోను నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత పెరిగిందని, టాస్కుల పేరిట షోలో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 9 మంది ప్రతివాదులకు గతంలో హైకోర్టు సూచన చేసింది. అయితే కౌంటర్ దాకలువు నాలుగు వారాల గడువు కావాలని అక్కినేని నాగార్జున, స్టార్ మా తరపు న్యాయవాదులు కోరారు.
వీరి అభ్యర్థనతో విచారణను న్యాయస్థానం మరో నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోపై సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోని బ్యాన్ చేయాలని నారాయణ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని ఈ షోని బ్యాన్ చేయాలని పలువురు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు.