మంత్రి బొత్సా సత్యనారయణకు అనంతపురంలో నిరసన సెగ తగిలింది. ఆయన అనంతపురంలో వరదలపై సమీక్షాసమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశం ముగించికుని వస్తున్న క్రమంలో మంత్రి కారును విద్యార్థి సంఘాలు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. వరద భాదతులకు సహాయం అందించాలని..నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కానీ బొత్సా ఏం మాట్లాడకపోవడంతో వారు కారుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగానే వరదల పై నిర్వహించిన సమీక్షాసమావేశంలో మంత్రి బొత్సా ముందే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య వాగ్వాదం నెలకొంది. వరదలు వస్తుంటే టీడీపీ నేతలు నిద్రపోతున్నారా..ప్రభుత్వం పై అనవసర విమర్శలు చేయొద్దు అంటూ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముందు అన్నారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.