దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణంపై యావత్ భారత దేశం కన్నీరు కారుస్తోంది. దేశం ఓ దేశభక్తున్ని కోల్పోయిందని బాధపడుతున్నారు. బిపిన్ రావత్ మరణంపై పాకిస్థాన్ తో సహా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాల సైనికాధికారులు కూడా నివాళి అర్పించారు . ఇదిలా ఉంటే చైనా మాత్రం బిపిన్ రావత్ మరణంపై తన వక్రబుద్దిని చూపిస్తుంది. బిపిన్ రావత్ మరణాన్ని తక్కువ చేసేలా కారుకూతలు కూస్తోంది. భారత మిలటరీకి క్షమశిక్షణ లేదని.. పోరాట సన్నద్ధత కూడా తక్కువేనంటూ పిచ్చివాగుడు వాగింది. చైనా ప్రభుత్వ రంగ టీవీ గ్లోబల్ న్యూస్ లో ఆ దేశ సైనిక నిపుణులతో ఓ కార్యక్రమం చేసింది. దీంట్లో బిపిన్ రావత్ మరణంపై వాగింది.
గతంలో బిపిన్ రావత్ ఆధ్వర్యంలోనే చైనాను డోక్లాంలో అడ్డుకుంది. ఇటీవల గల్వాన్ ఘర్షణ అనంతరం చైనాపై పైచేయి సాధించేందుకు బిపిన్ రావత్ వ్యూహాలు పనికొచ్చాయి. అందుకే బిపిన్ రావత్ అంటే చైనాకు మంట ఉందనేది వాస్తవం. దీంతో ఆయన విలువను తగ్గించేలా వ్యాఖ్యలు చేస్తుందని తెలుస్తోంది.