త్వరలోనే సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో ఇంటర్నేషనల్ స్టేడియం !

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ త్వరలోనే గజ్వేల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్ రావు చెప్పారు.తెలంగాణ జాతిపిత, తెలంగాణ కారణజన్ముడైన కేసిఆర్ కు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ క్రీడాకారులతో కలిసి విష్ చేశారు.

సీఎం కేసీఆర్​ 68వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మున్సిపాలిటీ పాలక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అనంతరం గజ్వేల్ లోని మినీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కరాటే, బాడీ బిల్డింగ్, క్రికెట్ క్రీడలలో గెలుపొందిన జాతీయ, రాష్ట్రీయ స్థాయి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

ఈ మేరకు ఫుట్ బాల్ కోర్టు ప్రతినిధులతో కలిసి స్టిక్కర్లను ఆవిష్కరించి, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నిర్వహించిన సంప్రదాయ నృత్య కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఎస్ఏంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news