ఆస్ట్రేలియాలో విరాట్‌ కోహ్లీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌..వీడియో వైరల్‌

-

టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ కటౌట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఆస్ట్రేలియాలో విరాట్‌ కోహ్లీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌ ఇవాళ ఉదయమే జరుగగా.. కాసేపటి క్రితమే.. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ఇందులో విరాట్‌ కోహ్లీ కేక్‌ కట్‌ చేయడం.. మిగతా ప్లేయర్లు ఎంజాయ్‌ చేయడం స్పష్టంగా కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version