కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ కిషన్ రెడ్డి పై బండ బూతులతో రెచ్చిపోయారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబర్ పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ దిష్టి బొమ్మను దహనం చేసి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బీజేపీ నేతలు మాత్రమే కాకుండా అంజన్ కుయాద్ యాదవ్ వ్యాఖ్యలను ఇతర పార్టీల నేతలు సైతం ఖండిస్తున్నారు.