జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు : అచ్చెన్నాయుడు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారన్నారు. పదవుల పంపకం నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు అన్నింటిలోనూ జగన్ తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మిగిలిన సామాజిక వర్గాలకు కత్తి పీట వేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2022- 23 బడ్జెట్లో 5.53 శాతం ఉన్న గిరిజనుల పెన్షన్లకు కేవలం రూ. 971 కోట్లు కేటాయించిన జగన్ తన సామాజికవర్గ రెడ్డి కార్పోరేషన్ పెన్షన్లకు మాత్రం రూ. 1555 కోట్లు కేటాయించారని అచ్చెన్నాయుడు అన్నారు. రెడ్లలో పేదరికం పెరిగించని చెబుతున్న జగన్ రెడ్డి.. నిజంగా రెడ్డి సామాజికవర్గంలో పేదిరికం పెరిగినా దామాషా ప్రకారం 17.08 శాతం ఉన్న ఎస్సీలకు రూ. 7 వేల కోట్లు, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రూ. 16 వేల కోట్లు కేటాయించాలన్నారు అచ్చెన్నాయుడు.

Atchannaidu: డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ.. నాకు అదనపు భద్రత కల్పించండి.. - NTV Telugu

కానీ జగన్ మాత్రం ఎస్సీలకు కేవలం రూ. 3 వేల కోట్లు, బీసీలకు రూ.8 వేల కోట్లే కేటాయించి సగం నిధులు కోత కోశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ఎందుకంత కక్ష అని ఆయన విమర్శించారు. సీఎం స్ధానంలో ఉన్న వ్యక్తి అన్ని కులాల్ని ఆదరించాలని, ఒక కులానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ.. జగన్ చేస్తున్న మోసాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా గ్రహించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని, చంద్రబాబు సీఎం అయితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిజమైన సంక్షేమం, స్వాతంత్రమని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news