ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారింది : పినరయి విజయన్

-

బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినరయి విజయన్‌ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని అన్నారు. తెలంగాణ చేపడుతున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారని పినరయి విజయన్‌ అన్నారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ సర్కార్‌ అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పినరయి విజయన్‌.

‘ కేసీఆర్‌ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు ఉంటుంది. కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది.దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది. రాష్ట్రాల సమ్మేళనమే దేశం. ఫెడరల్‌ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోంది. కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి పాలిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version