Breaking : జగిత్యాలలో బీజేపీ నేతల అరెస్టుల పర్వం..

సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో రేపు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, కొడిమ్యాల, పెగడపల్లి బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana BJP: ఎలక్షన్ మూడ్‌లో తెలంగాణ బీజేపీ | Telangana BJP Elections  Hyderabad suchi

రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగిత్యాలకు చేరుకోనున్న కేసీఆర్… ముందుగా కొత్తగా నిర్మించిన జిల్లా పార్టీ కార్యలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు సీఎం కేసీఆర్‌ పయనంకానున్నారు. ఇప్పటికే సీఎం టూర్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.