ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలి :ఈటల రాజేందర్

-

ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలని ఈటల రాజేందర్ చురకలు అంటించారు. నీచ, నికృష్టమైన, మతి తప్పిన కేసీఆర్ ఆలోచనలతో రైతులు మునిగిపోయారని.. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే‌.‌. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? అని ఆగ్రహించారు. చేతకాక, చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నాడని మండిపడ్డారు.

పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడని.. లక్షలాది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారని రెచ్చి పోయారు. మాపై కోపాన్ని.. తనకు అధికారం ఇచ్చిన రైతులపై చూపుతున్నాడని.. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నందునే కేసీఆర్ నెపాన్ని కేంద్రంపై వేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

రైతులు పంటలు వేయకుండా కంటిలో మట్టికొట్టి కనీళ్ళు చూస్తున్నాడని.. పంజాబ్ లో రెండో పంట గోధమలు వేస్తారని తెలిసికూడా కేసీఆర్ అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోవాలని.. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందన్న ఆశతో రైతులు కోతకు సిద్ధమవుతున్నారన్నారు. కోటి మందికి రైతుబంధు ఇస్తే.. 35లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావటం విడ్డూరమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news