కారు-కాంగ్రెస్‌కు కమలం చుక్కలు!

-

మునుగోడులో కారు-కాంగ్రెస్ పార్టీలకు కమలం పార్టీ చుక్కలు చూపిస్తుంది…రెండు పార్టీల్లోనే బలమైన నేతలని లాగేస్తూ రెండు పార్టీలని షేక్ చేస్తుంది. వాస్తవానికి మునుగోడులో బీజేపీకి పెద్ద బలం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు బీజేపీకి 12 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీ బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని లాగడం వల్ల మూనుగోడులో బీజేపీ బలం పెరిగింది. ఇప్పుడు కోమటిరెడ్డి బలంపైనే మూనుగోడులో బీజేపీ గెలుపు ఆధారపడి ఉంది.

కాకపోతే పూర్తిగా కోమటిరెడ్డి బలంపై ఆధారపడితే బీజేపీకి దెబ్బ పడిపోతుంది. అందుకే టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన ద్వితీయశ్రేణి నేతలని బీజేపీ లాగేస్తుంది. అలాగే సర్పంచ్‌లు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలని సైతం పార్టీలోకి తీసుకొచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు బలం ఎక్కువ. ఇప్పుడు ఆ బలాన్ని బీజేపీ తగ్గించే పనిలో ఉంది. మూనుగోడులో బీజేపీ జీరో నుంచి మొదలైందని చెప్పొచ్చు…ఎంతమంది నాయకులు వస్తే…అంతగా బీజేపీ బలం పెరుగుతుంది. అందుకే రెండు పార్టీల్లో ఉన్నవారిని బీజేపే లాగేస్తుంది. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ అదే పనిలో ఉన్నారు…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకొస్తున్నారు.

దీంతో ఆ రెండు పార్టీల్లో టెన్షన్ మొదలైంది…ఏ సమయంలో ఏ నాయకుడు వెళ్లిపోతాడా?అని భయపడే పరిస్తితి. ఇక అధికార టీఆర్ఎస్ ఏదొకవిధంగా తాయిలాలు ఇచ్చి…తమ నేతలని ఆపే ప్రయత్నం చేస్తుంది…అటు కాంగ్రెస్ చేతులెత్తిసినట్లు కనిపిస్తోంది. అయితే ఎన్ని చేసిన బీజేపీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ బీజేపీలో చేరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి కారు-కాంగ్రెస్ పార్టీల బలం తగ్గిపోయి కమలం బలం పెరుగుతుంది..ఏదేమైనా రెండు పార్టీలకు బీజేపీ చుక్కలు చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news