GodFather : “గాడ్ ఫాదర్” టీజర్ ప్రోమో రిలీజ్..

-

God Father : మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుకూనంగా క‌థ‌ను మర్చి రాశారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇందులో చిరంజీవి చాలా స్టైలీస్‌ గా కనిపించారు. ఇక ఈ టీజర్‌ ను ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news