హైకోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత స్పీకర్ ని కలిసిన తర్వాత ఆయనలో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన చెప్పిన మాటల్లో భయం కనిపించిందని అన్నారు. స్పీకర్ గారిపై సీఎం ఎంత టార్చర్, ఎంత ఒత్తడి పెడుతున్నారో మాకు అర్థం అయిందని రాజాసింగ్ అన్నారు. నేను పోడియం వద్దకు వచ్చానని.. మా ఇద్దరు ఎమ్మెల్యే ఏం తప్పు చేశారని.. వారిని ఎందుకు సస్పెండ్ చేశారని స్పీకర్ ని కోరారని రాజాసింగ్ అన్నారు. సభలో బీజేపీ వాయిస్ లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ వినలేదని రాజాసింగ్ అన్నారు.
స్పీకర్ పై సీఎం ఒత్తడి కనిపించింది: రాజాసింగ్
-