ఏపీ బీపీ : కేంద్రం ఝ‌ల‌క్ ! ఎలా అంటే ? ఎందుకంటే ?

-

ప‌దివేల‌కు పైగా ఆర్బీకే సెంట‌ర్లు ఇందుకు 90 శాతంకు  పైగా కేంద్రం నిధులు. అన్యాయం ఏంటంటే వీటికి వైఎస్సార్ పేరు పెట్ట‌డం అని గ‌గ్గోలు పెడుతోంది ఏపీ బీజేపీ. ఇప్పుడిక పేరు మార్పుతో గొడ‌వ కాస్త స‌ర్దుమ‌ణిగింది. పీఆర్ ఇంజినీర్లు కూడా కేంద్రం చెప్పిన విధంగానే పేర్ల మార్పుపై సత్వ‌ర చ‌ర్య‌లు తీసుకుని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.
జ‌గ‌న్ వ‌ర్గాలు ఓవైపు కేంద్రంతో ఎంతో స‌ఖ్యంగా ఉంటున్నా మోడీ మాత్రం కొన్ని విష‌యాల్లో క‌టువుగానే ఉంటున్నారు. ఆ  మాట‌కు వ‌స్తే కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు వైఎస్సార్ పేరు త‌గిలించి, కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌కు వైఎస్సార్ పేరు జోడించి

రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల‌కు మాత్రం మోకాల‌డ్డుతున్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇటువంటి పేర్లు ఎలా పెడ‌తార‌ని
ప్ర‌శ్నిస్తూ.. తాజాగా వైఎస్సార్ ఆర్బీకేల పేరు మార్పున‌కు కేంద్రం ప‌ట్టుబ‌ట్టింది. ఈ విష‌యంలో ఏపీ బీజేపీ వింగ్ స‌క్సెస్ అయింది. దీంతో రాత్రికి రాత్రే ఆర్బీకే (రైతు భ‌రోసా కేంద్రం)కు సంబంధించి కేంద్రం చెప్పిన విధంగా నేమ్ బోర్డ్స్  ఏర్పాట‌య్యాయి.ఓ విధంగా వివాదం కూడా కొలిక్కి వ‌చ్చింది.ఇక‌పై కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలకు సంబంధించి సంబంధిత నియ‌మ‌,నిబంధ‌న‌లు త‌ప్ప‌క వాడాల‌ని, లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ స‌ర్కారుకు స్ప‌ష్టం చేసింది మోడీ వ‌ర్గం.

ఆంధ్రావ‌ని వాకిట కొన‌సాగుతున్న పేర్ల వివాదానికి, రంగుల విభేదానికి ఇంకా ఫుల్ స్టాప్ ప‌డ‌డం లేదు. తాజాగా మ‌రో వివాదం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర పెద్ద‌ల చొర‌వ‌తో కేంద్రం అప్ర‌మ‌త్త‌మై ఓ నిర్ణ‌యం వెలువ‌రించింది. దీంతో జ‌గ‌న్ వ‌ర్గాలకు ఈ నిర్ణ‌యం మింగుడు ప‌డ‌డం లేదు. ఏం చేయాలో  తోచ‌క కేంద్రం ఏం చెబితే అదే ఫైనల్ అని ఓ భావ‌న‌కు ఓ నిర్థార‌ణ‌కు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. వాస్త‌వానికి 90శాతం న‌రేగా (ఉపాధి హామీ ప‌థ‌కం క్లుప్త రూపం) నిధుల‌తో రైతు భ‌రోసా కేంద్రాలు నిర్మించారు. వీటికి ఐక్య‌రాజ్య సమితి కూడా మంచి గుర్తింపు మ‌రియు గౌర‌వం ఇచ్చింది.

ప్ర‌పంచ స్థాయి  ఖ్యాతి పొందిన ఆర్బీకేల పేరు ఇక‌పై మారిపోనుంది. ఇదే జ‌గ‌న్-కు కేంద్రం ఇచ్చిన ఝ‌ల‌క్ ! పేరు మార్పుతో అగ్రిక‌ల్చ‌ర్ ప్రొడ్యూస్ స్టోరేజ్  బిల్డింగ్స్ (వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తి నిల్వ భ‌వ‌నాలు)  అని ఇక‌పై వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేరకు పంచాయ‌తీ రాజ్ శాఖ కూడా సంబంధిత చర్య‌లు తీసుకుంది.ఇప్ప‌టికే భ‌వ‌న నిర్మాణాలు పూర్త‌యిన వాటికి పేర్ల‌ను ఈ విధంగానే రాయించేందుకు పంచాయ‌తీరాజ్ శాఖ అధికారులు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లా , ఇబ్ర‌హీం ప‌ట్నం మండ‌లంలో జూపుడి, కేత‌న‌కొండ‌, కొటిక‌ల‌పూడి ఆర్బీకేల పేర్లు మారిపోయాయి కూడా !

Read more RELATED
Recommended to you

Latest news