ఉద్యోగాల పేరుతో బండి సంజయ్ చిల్లర డ్రామాలు, చీప్ పబ్లిసిటీ కార్యక్రమాలు- బాల్క సుమన్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నిరుద్యోగ దీక్షపై ఫైరయ్యారు రాష్ట్ర విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.32 లక్షల ఉద్యోగాలను భర్త చేశామని. సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వాారా మరో 16 లక్షల యువతీయువకులకు ఉద్యోగాలు ఇచ్చామని బాల్క సుమన్ అన్నారు. అయినా బీజేపీ నాయకులు, బండి సంజయ్ వంటి వారు ఉద్యోగాల పేరుతో చిల్లర డ్రామాలు ఆడుతున్నారని… చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో కనీసం కలిసిరాలేదని విమర్శించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర పోరాటంలో లేదు, ఉద్యమంలో లేదని ఆయన అన్నారు. ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కొత్త సంవత్సరంలో కొన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం.. ఇది తెలిసే బండి సంజయ్ దీక్షడ్రామాకు తెరలేపారని విమర్శించారు.

2014లో ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఏడేళ్లలో 14 కోట్ల ఉద్యోగాలు రావాలి.. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు… తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో బండి సంజయ్ వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version