బీజేపీ వర్సెస్ కాంగ్రెస్: తెలంగాణలో లీడ్ ఎవరిది?

-

తెలగాణలో త్రిముఖ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి. మొన్నటివరకు అంటే తెలంగాణలో ప్రతిపక్షాలు పెద్దగా సత్తా చాటలేకపోయాయి…కానీ నిదానంగా పరిస్తితులు మారాయి. ఓ వైపు అధికార టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుంది..మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తున్నాయి.

congress-party-bjp-partyఇక కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి, బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షులు అయ్యాక పూర్తిగా రాజకీయం మారిపోయింది. ఈ ఇద్దరు దూకుడుగా కేసీఆర్‌పై ఫైట్ చేస్తున్నారు. అలాగే తమ పార్టీలని బలోపేతం చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో ఏ పార్టీ బలంగా ఉంది…ఏ పార్టీ అయితే టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వగలదు అనే అంశాలని ఒక్కసారి చూస్తే…ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి…రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీకి బలం ఎక్కువ కనిపిస్తోంది. కానీ ఆ బలం నిదానంగా తగ్గుతూ వస్తుంది.

ఇక టీఆర్ఎస్ తర్వాత రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఏది అంటే…చెప్పడం కష్టమే అనాలి…ఎందుకంటే ఇటీవల ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి మరీ బీజేపీ సత్తా చాటుతుంది. అలా అని కాంగ్రెస్‌కు బలం లేదని చెప్పడానికి లేదు. కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం బాగా ఉంది…ఆ బలం బీజేపీకి లేదు. ఇప్పటివరకు బీజేపీకి వచ్చిన విజయాలు నాయకులని బట్టి వచ్చాయి. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి కలిసొచ్చే అంశం.

అయితే క్షేత్ర స్థాయిలో బీజేపీ బలం పెరగాల్సిన అవసరముంది. అప్పుడే రాష్ట్ర స్థాయిలో బీజేపీకి బలం వస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ బలం కొందరు నాయకులు, కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉంది. అలాగే నాయకులు ఉన్నారు గానీ, వారు బలపడాల్సిన అవసరముంది. బీజేపీతో పోలిస్తే ఎక్కువ జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలం ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే రెండు పార్టీల బలాలు ఒకేలా ఉన్నాయి. అయితే ఎన్నికల్లోపు ఎవరు తమ బలాన్ని పెంచుకుంటారో వారే టీఆర్ఎస్‌ని ఢీకొట్టగలరు అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news