బీజేపీ కి బీఆర్ఎస్ కి మధ్య వికారాబాద్ జిల్లాలోని పెరిగి అనే గ్రామం లో ఫ్లెక్సీ ల యుద్ధం జరిగింది. తమ బ్యానెర్లు(ఫ్లెక్సీ) లు వేరే పార్టీ వాళ్ళు కావాలనే తీసేశారని బీజేపీపార్టీ కి చెందిన సర్పంచ్ పై బీఆర్ఎస్ గ్రామ నాయకులు ఆందోళన కు దిగారు. ఈ నేపధ్యం లో ఇరువర్గాల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఫ్లెక్సీల తొలగింపుతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గొడవ రాజుకుంది. అయితే ఇరు వర్గాలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా,ఇరు పార్టీల కార్యకర్తలు పోలీసుల తో కూడా గొడవ పడ్డారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేటలో పల్లెబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి జరిపిస్తున్నారు. ఈ నేపధ్యం లో గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఫ్లెక్సీలు వేయించారు. ప్రభుత్వం నుండి గ్రామానికి వచ్చిన నిధుల వివరాలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఈ గ్రామంలో బీజేపీ మద్దతుగా గెలిచిన సర్పంచ్ ఉండటంతో..తమ అనుమతి లేకుండా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని సర్పంచ్ బీఆర్ఎస్ నేతల పై మండిపడ్డారు. గ్రామ పంచాయితీ సిబ్బందితో సర్పంచ్ ఫ్లెక్సీలు తీయించివేశారు. గ్రామానికి వచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని..ఫ్లెక్సీల్లో తప్పుగా వేయించారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.