BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెటర్లకు శుభవార్త చెబుతూ..కీలక ప్రకటన చేసింది BCCI పాలక మండలి. బీసీసీఐ సరి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, మహిళ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళా క్రికెటర్ల పై ఉన్న వివక్షను పారద్రోలేలా, వారి చెల్లింపుల్లో ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు బిసిసిఐ కార్యదర్శి జై షా ట్విట్ చేశాడు. దీంతో మెన్ క్రికెటర్లతో సమానంగా, మహిళ క్రికెటర్లకు టెస్ట్ (రూ .15 లక్షలు) , ODI (రూ. 6 లక్షలు) , T20I (రూ.3 లక్షలు) చెల్లించనున్నారు.