నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : షర్మిలకు వినోద్ కుమార్ వార్నింగ్

-

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని షర్మిలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో విద్యా వికాసానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని పేర్కొంది. ఏడేళ్లుగా నవోదయ విద్యాలయాల ఊసే ఎత్తని కేంద్ర ప్రభుత్వం.. కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ, రాష్ట్రంలో ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం ఏర్పాటును మరిచిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ., జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారని గుర్తు చేశారు. కేంద్ర, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయీ అని పేర్కొన్నారు. ఈ విషయం షర్మిల….మీకు తెలియదా..? షర్మిల మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇలాంటి పథకాలను షర్మిల మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version