చంద్రబాబు అన్న టిడిపి అన్న ప్రాణం అని ఉదయగిరి టిడిపి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చెప్పారు. ఉదయగిరి టీడీపీ సీటు ఆశించారు. అయితే టిడిపి విడుదల చేసిన జాబితాలో ఇంకో పేరు ఉంది దీంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బొల్లినేని రామారావు కీలక కామెంట్స్ చేశారు. 14 ఏళ్ల పార్టీ కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పక్క నియోజకవర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా తనకు ఇవ్వలేదని అన్నారు.
చంద్రబాబు దళారీల మాటలు వింటున్నారని అన్నారు. చంద్రబాబుతో తానే స్వయంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశానని కానీ వీలు కాలేదని అన్నారు మార్చి రెండున చంద్రబాబుని కలుస్తానని ఆయనతో మాట్లాడాక ఒక నిర్ణయం తీసుకుంటానని బొల్లినేని చెప్పారు తనకి టికెట్ ఇవ్వట్లేదు అని ముందే చెప్తే బాగుండేది అని అన్నారు. స్థానిక నేతలకు తెలియకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని టిడిపి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చెప్పారు.