చక్కెర పానీయాలు తాగడం వల్ల ముప్పు వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజులో రెండు లేదా అంతకంటే ఎక్కువ చక్కెర పానీయాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యాయాలు చెబుతున్నాయి. ఈ సమస్య పురుషుల కంటే యువతులు, మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. చక్కెర, తీపి పానీయాలు (ఎస్ఎస్‌బీ) తాగడం వల్ల ఎకో-కొలొరెక్టల్ క్యాన్సర్ (ఈఓ-సీఆర్‌సీ) శరీరంలో అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయని కనుగొన్నారు. ఎస్ఎస్‌బీలకు ఉదాహరణగా శీతల పానీయాలు, ప్యాకింగ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్‌గా చెప్పుకోవచ్చు.
చక్కెర పానీయాలను ప్రతిరోజు రెండు లేదా అంతకంటే ఎక్కువగా తాగడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్‌కు గురవుతామన్నారు. ఈ సమస్య యువతులు, మహిళల్లో రెండు రెట్లు పెరిగిందన్నారు. వారానికి ఒక్కసారి చక్కెర పానీయాలు తీసుకునే వారు. అంతకంటే తక్కువ సేవించే వారిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ విషయాలు తెలుసుకున్నారు. 13 నుంచి 18 ఏళ్ల యువతుల్లో ప్రతి రోజు తీపి పానీయాలు ఇవ్వడం వల్ల 32 శాతం కొలొరెక్టర్ క్యాన్సర్ బారిన పడినట్లు గుర్తించారు. ఈ సమస్య సంపన్న దేశాల్లోనే అధికంగా ఉన్నట్లు తెలిపారు.
కృత్రిమంగా తయారు చేసిన తీపి పానీయాలు, కాఫీ, ఫ్యాట్‌లెస్ మిల్క్, ఇలాంటి పానీయాలను తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ సమస్య తక్కువగా ఉంటుందన్నారు. యుఎస్‌కు చెందిన పరిశోధకులు 95,464 మంది మహిళలపై పరిశోధనలు నిర్వహించారు. 1989లో 25-42 ఏళ్ల మహిళలపై పరిశోధన ప్రారంభించారు. ప్రతి 4 ఏళ్లకు పరిశోధనకు సంబంధించిన రిపోర్టులను వెల్లడించారు. వీరు ఎక్కువగా ఆస్పిరిన్, యాంటీ ఇన్‌ఫ్లీమెటరీ డ్రగ్స్, విటమిన్స్, నాన్-స్టెరాయిడల్ వంటి కారకాల వల్ల ఈ సమస్యను గుర్తించారు. 24 ఏళ్ల పరిశోధనలో 109 మంది మహిళలు 50 ఏళ్ల కంటే ముందే ప్రేగు క్యాన్సర్ బారిన పడ్డారు.
వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇన్‌కావో మాట్లాడుతూ.. తీపి పానీయాలు, కొవ్వు ఎక్కువగా ఉంటే పాలను తీసుకోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రయోజనం కల్పిస్తుందన్నారు. రోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువ తీపి పానీయాలను తీసుకోవడం వల్ల మహిళలు ప్రేగు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. అయితే చక్కెర లేని పానీయాలు, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలతో టీ, కాఫీలు తాగడం మంచిదన్నారు. అలాగే చక్కర పానీయాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం, మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్త కార్మెన్ పియోర్నాస్ తెలిపారు.