భారత అమ్ముల పొదలోకి మరో క్షిపణి వచ్చి చేరింది. ఇండియన్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అయితే సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను చేధించడమే యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రత్యేకత.. బ్రహ్మోస్ యాంటీ-షిప్ వెర్షన్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపాయి.
ఈ నెల 19న భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధవిమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించారు. అంతకుముందు హిందూ మహా సముద్రం నుంచి బ్రహ్మోస్‌ను పరీక్షించారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదిస్తుందని అధికారులు తెలిపారు.