Breaking: అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో 200 మృతదేహాలు..

-

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ఉక్రెయిన్‌ పౌరులు అసువులు బాసినా.. యుద్ధం మాత్రం ఆగడం లేదు. అయితే.. తాజాగా బయటపడిన ఓ నిజం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. భీకర పోరాటం తర్వాత ఇటీవల మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.

దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే, సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని ఉక్రెయిన్ మండిపడింది. మరోవైపు, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version